ఈటల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ కు బండి సంజయ్‌ హెచ్చరిక

BJP leader Bandi Sanjay warns CM KCR

0
115

మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి బీజేపిలో చేరిన తరువాత టీఆర్ఎస్,బీజేపి పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు మరింత పెరిగింది. తాజాగా సిఎం కేసీఆర్ ను తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించాడు

ఈటల రాజేందర్ జోలికొస్తే సీఎం కేసీఆర్ గడీలు బద్దలు కొడుతామని బీజేపీ నేత బండి సంజయ్‌ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకారులకు ఏకైక వేదిక బీజేపేనని పేర్కొన్నారు.

గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని సంజయ్‌ ప్రకటించారు. కేపీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. హుజురాబాద్ అభివృద్ధి కాకుంటేనే ఈటల 6 సార్లు గెలిచారా? అని ప్రశ్నించారు. సర్పంచ్‌కి కేసీఆర్ ఫోన్ చేశారంటే ఈటల బీజేపీలో చేరడం వల్లేనని సంజయ్‌ అన్నారు.