ఆ బీజేపీ నేతకి కేంద్రం నుంచి కబురు జగన్ ఎఫెక్ట్

ఆ బీజేపీ నేతకి కేంద్రం నుంచి కబురు జగన్ ఎఫెక్ట్

0
99

ఈ మధ్య తెలుగుదేశం పార్టీనుంచి కండువా పక్కన పెట్టి, కాషాయ కండువా కప్పుకున్న తెలుగుదేశం నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఓ నాయకుడు, ఇక్కడ ఏపీలో బీజేపీ భజన కంటే తెలుగుదేశం భజన చేస్తున్నారు అనేది ,తాజాగా ఏపీ బీజేపీ నేతలు కేంద్రానికి రిపోర్టులో పంపించారు.

అయితే కావాలనే ఇదేదో బాబుకి భజన కార్యక్రమంలా ఉందని తమ పార్టీ తరపున ఏమీ పోరాటం చేయకుండా ఆ పార్టీ తరపున వత్తాసు పలుకుతున్నారు అని, ఈ చిలుక పలుకుల కథ అంతా అక్కడ కేంద్రం దగ్గర విప్పారట ఏపీ నేతలు, అయితే సదరు నాయకుడు మాత్రం జగన్ పై విమర్శలు చేయడం చేస్తున్నా అంతా బాబుపై ప్రేమ చూపిస్తున్నాడు.

ఇది ఏపీలో కొందరు నాయకులకి నచ్చలేదు.. అసలు బీజేపీ సిద్దాంతాలు కూడా ఈ నాయకుడికి తెలియదు అని చెప్పారట.. దీంతో కేంద్రంలో ఓ కీలక నాయకుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట, ఉంటే పార్టీలో ఉండాలి అని లేకపోతే మీ పాత పార్టీలోకి నిర్మొహమాటంగా వెళ్లిపోవచ్చు అని చెప్పారట.