ఫ్లాష్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్

0
88

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజా సింగ్‌పై కేసులు నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి గురువారం ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్‌హట్ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రాజా సింగ్ ని మరోసారి అరెస్టు చేశారు. కాగా రెండు రోజుల క్రితం మహమ్మద్ ప్రవక్త పై, ఇస్లాం మతం పై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.