Bandi Sanjay | బండి సంజయ్‌పై కోడి గుడ్లతో దాడి..

-

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం వంగరలో యాత్ర నిర్వహిస్తున్నారు. వంగరలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇంటిని బండి సంజయ్ సందర్శించారు. ఆ తర్వాత ముల్కనూర్‌ బయల్దేరుతుండగా ఇద్దరు వ్యక్తులు సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు.

- Advertisement -

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ కార్యకర్తలే ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని.. తనకు పోలీసుల భద్రత అవసరం లేదని.. తన రక్షణ కార్యకర్తలే చూసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ ఆడుతున్న డ్రామాను పట్టించుకోవద్దని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్న యాత్రకు దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు. బండి పాదయాత్రను అడ్డుకోవాలనే ఎలాంటి ఉద్దేశం మాకు లేదన్నారు. మతిభ్రమించిన సంజయ్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే సంజయ్ పాదయాత్రను అడ్డుకోవద్దని కోరుతున్నానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...