చంద్రబాబుకు నో ఎంట్రీ తేల్చి చెప్పిన బీజేపీ

చంద్రబాబుకు నో ఎంట్రీ తేల్చి చెప్పిన బీజేపీ

0
114

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది.. ఇక నుంచి ఆయనతో పొత్తు పెట్టుకుని ప్రతీసారి మోసపోవడానికి తాము సిద్దంగా లేదని అన్నారు… తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…

ఇటీవలే చంద్రబాబు నాయుడు బీజేపీతో వైర్యంపెట్టుకోవడం వల్లే ఓడిపోయామన్న మాటకు కన్నా స్పందించారు. చంద్రబాబు నాయుడు పెద్ద అవకాశ వాది అని అన్నారు… ఆయన ఏ రోజు ఏ మాట్లాడుతారో అర్ధం కావడంలేదని అన్నారు…

1999లో వాజ్ పేయి ఇమేజ్ ను దృష్టిపెట్టుకుని బీజేపీని రాష్ట్రంలో సమాది చేశారని అలాగే 2014 ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని తమ పార్టీని శాశ్వితంగా సమాది చేయాలని చూశారని అన్నారు… ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా బీజేపీలో టీడీపీకి శాశ్వితంగా తలపులు మూసేశామని చెప్పారని గుర్తు చేశారు…