బీజేపీ నుంచి పవన్ కు ఆహ్వానాలు

బీజేపీ నుంచి పవన్ కు ఆహ్వానాలు

0
89

ఏపీలో రాజకీయ దుమారం రేగింది అని చెప్పాలి.. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి దగ్గర అయ్యే విధంగా ఆయన చేసిన కామెంట్లతో ఇప్పుడు అందరూ కూడా పవన్ కల్యాణ్ బీజేపికి దగ్గర అవుతున్నారు అనేలా చర్చించుకుంటున్నారు.. ఓ పక్క పవన్ తనపార్టీ తరపున కేవలం ఒక్క ఎమ్మెల్యేతో ముందుకు వెళుతున్నారు.. ఈ సమయంలో బీజేపీతో కలిస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు.

తాజాగా పవన్ వ్యాఖ్యల తర్వాత బీజేపీ నేత రఘనాథబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. జనసేన పార్టీ వస్తే విలీనం చేసుకోవడానికి తాము సిద్ధంగా వున్నామని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పవన్ ఉద్దేశ్యం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెయిల్యూర్ సీఎం అని ఆయన అమరావతిలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని అన్నారు.. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయి ఆరునెలలు అయింది ఏమీ సాధించలేదు అనేలా ఆయన పాలన ఉంది అని ఆయన ప్రశ్నించారు.

గత ఎన్నికల కంటే ముందు అంటే 2014లో పవన్ కల్యాణ్ తమకు మిత్రుడే అని, మళ్లీ తమతో కలిస్తే సంతోషమేనని, తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ మిత్రపక్షంగా ఉన్నా పార్టీని విలీనం చేసినా తాము కలిసి ముందుకు వెళతాం అని తెలియచేశారు.