పవన్ కల్యాణ్ కు కొడాలి నాని పంచ్ .. నీ పేరేంటి

పవన్ కల్యాణ్ కు కొడాలి నాని పంచ్ .. నీ పేరేంటి

0
32

ఏపీలో రాజకీయం పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ అనేలా మారిపోయింది, ముఖ్యప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పై విమర్శలు చేస్తూనే ఇటు పవన్ పై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు.. గతంలో చంద్రబాబు ఒక్కరే ఉండేవారు జగన్ కు, కాని ఇప్పుడు రెండు ప్రతిపక్షాలు అలాగే బీజేపీ కూడా ఎదురుదాడి జగన్ పై చేయడంతో, వైసీపీ కూడా విమర్శలు ఎదుర్కొంటోంది.

తాజాగా పవన్ పై మంత్రి కొడాలి నాని కామెంట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ ను జగన్ రెడ్డి అని పవన్ కల్యాణ్ పిలిస్తే, పవన్ ని పవన్ నాయుడు అని తాము పిలవడం కామన్ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు.
అయితే కులాల పేర్లు తాను పెట్టుకోలేదు అని చెబుతున్న పవన్ కల్యాణ్, పవన్ కుమార్ అని తన తండ్రి పెట్టినపేరును ఎక్కడ పెట్టుకున్నారు అని ప్రశ్నించారు.

ఆయన తండ్రి పెట్టిన పేరుని ఉంచుకోలేదు అని విమర్శించారు.. ఇప్పటి వరకూ పవన్ నటించిన సినిమాల్లో ఏ సినిమాలో అయినా పవన్ కుమార్అ ని తన పేరు వేసుకున్నాడా అని ప్రశ్నించారు మంత్రి నాని …మొత్తానికి ఈ కులాలు మతాల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఇటు వైసీపీకి జనసేనకు కాస్త పొలిటికల్ ఫైట్ కు కారణం అవుతోంది