ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కే యెసరు పెట్టిన బండి సంజయ్

0
138

తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఏకంగా సిఎం కేసిఆర్ అధికార నివాసమైన ప్రగతిభవన్ తో పాటు ఆయనకు ఇష్టమైన ఫామ్ హౌస్ కు యెసరు పెట్టే ప్రయత్నం షురూ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ప్రగతిభవన్, ఫామ్ హౌస్ ను లక్ష నాగళ్లతో దున్నిస్తానని బండి సంజయ్ హెచ్చరించారు. శాంతి భద్రతల పేరుతో బిజెపి కార్యకర్తలను రాష్ట్రవ్యాప్తంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని కేసిఆర్ ఎన్నోసార్లు అన్నారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఇప్పుడు అటవీసిబ్బందిని పంపి పంటలను నాశనం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

హుజూరాబాద్ లో రానున్నవి బై పోల్స్ కావని, కేసిఆర్ బైయింగ్ ఎలక్షన్స్ అని ఎద్దేవా చేశారు. పది కాదు ప్రతి దళిత కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపును కేసిఆర్ అడ్డుకోలేడని తేల్చిపారేశారు. ఈటల బావమరిది చాటింగ్ పేరుతో ఫేక్ చాట్ సృస్టించారని, వాటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు సంజయ్.