టీడీపీలో మరో ఇద్దరిపై బీజేపీ టార్గెట్

టీడీపీలో మరో ఇద్దరిపై బీజేపీ టార్గెట్

0
88

తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఆర్దిక స్తంభాలుగా ఉన్న ఇద్దరు నేతలు బీజేపీలోకి వెళ్లిపోయారు.. వారే సుజనా చౌదరి, సీఎం రమేష్, అయితే ఇద్దరూ వెళ్లిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందులు ఎదురు అయ్యాయి అనే టాక్ వచ్చినా, ఆర్దికంగా పెద్ద ఇబ్బంది లేదు అంటున్నారు.. అయితే మరో ఇద్దరు నేతలు కూడా పార్టీకి ఆర్దికంగా సపోర్ట్ ఉంటారు అని తెలుస్తోంది.

అందుకే బాబు వారిని వదులుకోరు అంటున్నారు, అయితే తాజాగా వారికి కూడా బీజేపీ ఇఫ్పుడు గాలం వేసింది అని తెలుస్తోంది.. వారిలో ఒకరు నెల్లూరు జిల్లాలో కీలక నాయకుడికి ఉన్నారు ఆయనకు బీజేపీ గాలం వేస్తోందట, ఆయనని పార్టీలో చేర్చుకోవాలి అని చూస్తోంది.. అయితే ఆయన టీడీపీ వదిలిరాను అని తెలియచేశారట. మొత్తానికి టీడీపీ ఆర్దిక స్తంభాలుగా ఉన్న నేతలని టార్గెట్ చేయడం పట్ల అనేక వార్తలు వినిపిస్తున్నాయి.