బీజేపీ తీర్థం తీసుకున్న టీడీపీ లేడీ ఫైర్ బ్రాండ్

బీజేపీ తీర్థం తీసుకున్న టీడీపీ లేడీ ఫైర్ బ్రాండ్

0
77

కొద్దిరోజుల క్రితం టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిన శర్మ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… పార్టీలో అంతర్గత విభేదాలు, కొన్ని ఇబ్బందుల వలన ఆమె టీడీపీకి రాజీనామా చేశానని తెలిపింది… అంతేకాదు రాజీనామా లేఖలో తనకు మంచి గుర్తింపు ఇచ్చారని తెలిపారు యామిని…

కొన్ని వ్యక్తిగత కారణాలతో పాటు దేశం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అలాగే ఇతర బలమైన కారణాలవల్ల తాను రాజీనామా చేసానని తెలిపారు… దీంతో యామిని వైసీపీలో చేరుతారని మరికొందరు బీజేపీలో చేరుతున్నారని వార్త కథనాలు వచ్చాయి…

అప్పట్లో వీటిపై స్పందించిన యామిని తాను ప్రస్తుతం ఏ పార్టీలో చేరడంలేదని అన్నారు… అయితే తాజాగా బీజేపీ తీర్థం తీసుకున్నారు… కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో యామిని బీజేపీ తీర్థం తీసుకున్నారు… తాజాగా కడప జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గజేంద్ర సింగ్ పాల్గొన్నారు… ఆ కార్యక్రమంలో ఆమె బీజేపీ తీర్థం తీసుకుంది…