బీజేపీ వైసీపీ కలయికపై ఫుల్ క్లారిటీ….

బీజేపీ వైసీపీ కలయికపై ఫుల్ క్లారిటీ....

0
84

ఏపీలో ప్రస్తుతం ఒక వార్త సంచలనంగా మరుతోంది… ఎన్డీఏ ప్రభుత్వంలో వైసీపీ చేరబోతుందనే వార్తలు వస్తున్నాయి… ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విషయంపై స్పందించారు…

ఎన్డీఏలో చేరాలన్న ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు… తాము బీజేపీకి దగ్గరగా లేమని అలాని దూరంగానూ లేమని అన్నారు… రాష్ట్రం బాగుకోసం ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆ పాని సీఎం జగన్ చేస్తారని అన్నారు… ఇక దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు…

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీ అమిత్ షాలతో భేటీ అయి చర్చించిన అంశాలు పాలనా పరమైనవే అయి ఉండవచ్చని అన్నారు… అంతకు మించి ఏం ఉండదని అన్నారు… ఎన్డీఏ ప్రభుత్వంలో వైసీపీ చేరబోతుందన్న అంశంపై రాష్ట్ర నాయకత్వంకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు… అందువల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి వన్ని ఊహాగానాలే అని అన్నారు కన్నా…