బొత్స సోదరుడిపై ఫిర్యాదు షాక్ లో మంత్రి

బొత్స సోదరుడిపై ఫిర్యాదు షాక్ లో మంత్రి

0
85

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు.. అలాగే ఎక్కడైనా అవినితీ అక్రమాలు వస్తే సహించేది లేదు అని చెబుతున్నారు. దానిపై కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఫోన్ నెంబర్ కూడా తెలియచేశారు.. అవినీతి లంచాలు లేని పాలన చేస్తాను అని అన్నారు ముఖ్యమంత్రి జగన్.. అయితే తాజాగా.

మంత్రి బొత్స సోదరుడిపై తాజాగా స్పందనలో ఫిర్యాదు వచ్చింది, ఉత్తరాంధ్రాలో కీలక నేతగా ఉన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు ఆదినారాయణపై ఇలా ఫిర్యాదు రావడంతో వైసీపీ నేతలు షాక్ అయ్యారు.. విజయనగరంలోని సత్యసాయినగర్ లేఔట్ లోని ప్లాట్స్ ను కబ్జా చేశారని ఆరోపిస్తూ స్పందనలో అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

తమ లేఔట్ కు అన్ని అనుమతులు ఉన్నా తమ స్థలాల చుట్టూ ప్రహరీ గోడ కట్టారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు, అయితే దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు.