బ్రేకింగ్ జియో కస్టమర్లకు భారీ షాక్ …

బ్రేకింగ్ జియో కస్టమర్లకు భారీ షాక్ ...

0
86

టెలికం రంగంలో జియో పెను సంచలనం అనే చెప్పాలి… అతి చౌకగా జియో కాల్స్ డేటా ప్రవేశ పెట్టి మార్కెట్లో తనకు తిరుగులేదు అని నిరూపించుకుంది, అంతేకాదు కోట్లాది మంది యూజర్లను నెట్ వర్క్ కి మళ్లించుకుంది, మన దేశంలో డేటా వినియోగంలో కూడా రిలయన్స్ జియో కి మాత్రమే 100 లో 55 శాతం మంది యూజర్స్ ఉన్నారు.

ఇలా పాజిటీవ్ నిర్ణయాలు తీసుకుంటున్న జియో… గతేడాది డిసెంబర్లో సడన్గా ఇతర నెట్వర్క్స్కు చేసే అవుట్ గోయింగ్ కాల్స్కు ఛార్జీలను వసూలు చేయడం స్టార్ట్ చేసింది… ఈ సమయంలో జియో కస్టమర్లకు మరో షాక్ ఇచ్చేలా ఉంది అంటున్నారు.

ఇప్పుడు వైర్లెస్ డేటా టారిఫ్లను కూడా పెంచే ఆలోచనలో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి… ప్రస్తుతం 1జీబీ డేటాకు ఉన్న రూ.15 మొత్తాన్ని.. రూ.20కి పెంచే ఆలోచన జియో చేస్తోందట, ఇలా చేయాలి అంటే ముందు ట్రాయ్ అనుమతి తీసుకోవాలి.. అందుకే ట్రాయ్ కు ఇటీవల లేఖ రాసింది అంటున్నారు, అయితే వాయిస్ కాల్స్ ధరలు పెరగవు అని తెలుస్తోంది. ఇక ఈ పెంచిన ధరలు మరో ఆరునెలల తర్వాత అమలులోకి వస్తాయి అంటోందట.