ఏపీలో అందరికి సమానమైన పాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇక పలు కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పేదలకి సాయం చేసే విధంగా పలు పథకాలు ప్రవేశపెట్టిస్తున్నారు.. అర్హులకి సంక్షేమం అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
తాజాగా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇది నిజంగా పేద బ్రాహ్మణులకి ఓ మంచి వరం అనే చెప్పాలి….7 నుంచి 16 ఏళ్ల మధ్యనున్న పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని పిల్లలకు ఉపనయన ఒడుగు ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇక ఈ పథకం కింద వారికి 15 వేలు తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనున్నారు, ఏప్రిల్ 1 నుంచి ఇది ప్రారంభం చేయనున్నారట, అయితే దీనికి వైట్ రేషన్ కార్డు అవసరమా లేదా అనేది కూడా త్వరలో తెలియచేస్తారు, కేవలం పేద బ్రాహ్మణులకి మాత్రమే ఇది ఇవ్వనున్నారట..అలాగే, విదేశాల్లో చదువుకునే బ్రాహ్మణ యువతకు భారతి పథకంలో భాగంగా రూ.5 నుంచి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించనున్నారు. ఇది పూర్తిగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి, అలాగే ఆ కుటుంబానికి సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండాలి లేకపోతే అనర్హులు.