గ్యాస్ వినియోగదారులకి మరో అలర్ట్ నిజమే వచ్చే నెల నవంబర్ నుంచి కొన్ని కొత్త రూల్స్ వస్తున్నాయి, ఈ నిబంధనలు పాటించాల్సిందే, మరి ఆరూల్స్ ఏమిటో చూద్దాం. ముఖ్యంగా వినియోగదారుల హక్కులు కాపాడటం అలాగే గ్యాస్ మోసాలు లేకుండా చేయడానికి ఈ రూల్స్ తీసుకువస్తున్నారు.
1..కొత్త గ్యాస్ డెలివరీ సిస్టమ్ కు కొత్తగా డీఏసీ అని పేరు పెట్టారు. డీఏసీ అంటే డెలివరీ అథంటికేషన్ కోడ్ అని అర్థం.
2. ఇక మీరు గ్యాస్ బుక్ చేసిన వెంటనే మీకు సిలిండర్ ఇంటికిరాదు
3..సిలిండర్ బుక్ చేసిన తరువాత మీరు గ్యాస్ కంపెనీ వారికి ఇచ్చిన మొబైల్ నెంబర్కు డీఏసీ మెసేజ్ వస్తుంది.
4.. ఇలా మీకు వచ్చిన కోడ్ ని డెలీవరీ ఇవ్వడానికి వచ్చిన వారికి చెప్పాలి,
5. ఆ కోడ్ చూసుకుని ఒకే అయితే ఇవ్వడం జరుగుతుంది
6. మీరు గ్యాస్ సిలిండర్ కార్డ్ కు మీ మొబైల్ నెంబర్ ఇవ్వకపోతే రిస్క్ వెంటనే చేయించుకోండి
7. ఇది గృహానికి సంబంధించిన గ్యాస్ కి మాత్రమే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు కాదు అని తెలిపారు