బ్రేకింగ్ – ఏపీలో మ‌రో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

బ్రేకింగ్ - ఏపీలో మ‌రో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

0
110

ఏపీలో మ‌రో ఎన్నికల సంద‌డి మొదలైంది…ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే నీలం సాహ్నీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎంపీటీసీ జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది…ఈ నెల 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది.

 

 

ఇక ఏదైనా ఇబ్బంది వ‌చ్చి రీపోలింగ్ చేయాలి అంటే ఆ ప్రాంతంలో ఈనెల‌9 న రీ పోలింగ్ నిర్వ‌హిస్తారు….ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. త‌ర్వాత ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు, ఇక మ‌రో విష‌యం కోర్టు పరిధిలో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఉండబోవని ఎన్నికల సంఘం తెలిపింది.

 

ఇక విప‌క్షాలు కొత్త నోటిఫికేష‌న్ ఇస్తారు అని ఎదురుచూశాయి… వారికి ఇది నిరాశ అనే చెప్పాలి.

ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ్నించే తిరిగి ప్రారంభించాలని నూతన ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్ణయించారు…. ఎక్క‌డ ఏక‌గ్రీవాలు అయ్యాయో అక్క‌డ కాకుండా మిగిలిన చోట ఎన్నిక‌లు జ‌రుగుతాయి.