బ్రేకింగ్ — ఏపీ నుంచి హైద‌రాబాద్ కు త్వ‌ర‌లో బ‌స్సు స‌ర్వీసులు

బ్రేకింగ్ -- ఏపీ నుంచి హైద‌రాబాద్ కు త్వ‌ర‌లో బ‌స్సు స‌ర్వీసులు

0
100

లాక్ డౌన్ నుంచి ఏపీ తెలంగాణ‌లో ఎక్క‌డా అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌వ‌డం లేదు, హైద‌రాబాద్ నుంచి కొన్ని వేల మంది ఏపీ రావాలి అని భావించారు కాని బ‌స్సులు మాత్రం క‌ద‌ల‌లేదు, ఇటు హైద‌రాబాద్ కు ఏపీ నుంచి రావాలి అని భావించిన వారు ప్ర‌యాణాలు వాయిదా వేసుకున్నారు కార్లు మాట్లాడుకుని సొంత ప్రాంతాల‌కు చేరుకున్నారు.

అయితే మ‌రి ఎప్పుడు అంత‌రాష్ట్ర స‌ర్వీసులు ప్రారంభం అవుతాయి అంటే కాస్త గుడ్ న్యూస్ వినిపిస్తోంది.. ఏపీఎస్‌ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసుల్ని తిప్పడంపై కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటివరకు బెంగళూరుకు మాత్రమే బస్సు సర్వీసుల్ని ఆర్టీసీ నడుపుతోంది. సెప్టెంబర్ నెలలో చెన్నైకి సర్వీసుల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇక హైద‌రాబాద్ కు కూడా స‌ర్వీసులు తిప్పేందుకు సిద్దం అవుతోంద‌ట‌, అంతేకాదు ఈ నెల 21 తర్వాత టీఎస్‌ఆర్టీసీ అధికారులతో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు, ఈ భేటి త‌ర్వాత సెప్టెంబ‌ర్ మొద‌టి వారం లేదా రెండో వారం నుంచి కొన్ని కీల‌క స‌ర్వీసులు హైద‌రాబాద్ ఏపీకి న‌డుస్తాయి అని అంటున్నారు అధికారులు. దీనిపై ఈనెల 21 భేటీ త‌ర్వాత ప్ర‌క‌ట‌న రానుంది.