ఫ్లాష్ న్యూస్ – కరోనాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

ఫ్లాష్ న్యూస్ - కరోనాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

0
40

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాచుతోంది, ఏపీ తెలంగాణ‌లో కూడా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, అయితే తెలంగాణ స‌ర్కార్ ఈ స‌మ‌యంలో ఓ గుడ్ న్యూస్ చెబుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ సెప్టెంబర్‌ చివరి నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు.

ఆగస్టు నెలఖారుకల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలో వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలియ‌చేశారు, వేల‌ల్లో రోజు కేసులు న‌మోదు అయ్యేవి కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది, ఈ స‌మ‌యంలో ఈ గుడ్ న్యూస్ చెప్ప‌డంతో అంద‌రూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు వైద్య కళాశాలల అనుబంధ హాస్పిటళ్లలోనూ కరోనా చికిత్స అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స‌ర్కారు క‌రోనా క‌ట్ట‌డికి 100 కోట్లు కేటాయించింది అని తెలిపారు, విలువైన ఇంజెక్ష‌న్లు జిల్లా ఆసుప‌త్రుల‌కి కూడా పంపాము అని తెలిపారు..క‌రోనా పాజిటివ్‌ వస్తే ప్రభుత్వం తరపున 14 రోజులకు మందుల కిట్‌ అందజేస్తున్నట్లు తెలిపారు, కోవిడ్ పాజిటీవ్ వ‌స్తే ఇంటి ద‌గ్గ‌ర ఐసోలేష‌న్ లేని వారికి ఆస్ప‌త్రుల‌కి త‌ర‌లిస్తున్నాము అని అన్నారు