బ్రేకింగ్ — ఏపీలో ఆ ప్రాంతంలో వారం రోజులు లాక్ డౌన్ – ఎక్కడంటే

బ్రేకింగ్ --- ఏపీలో ఆ ప్రాంతంలో వారం రోజులు లాక్ డౌన్ - ఎక్కడంటే

0
118

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి… అయితే కరోనా కేసులు ఏపీలో కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో నిబంధనలు ఆంక్షలు కనిపిస్తున్నాయి… అయితే దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ ఉండే అవకాశం లేదు అని తెలిపారు ప్రధాని మోదీ, అయితే ఏపీలో కూడా సీఎం జగన్ అదే తెలిపారు, లాక్ డౌన్ విధించము అన్నారు.

 

 

అయితే కొన్ని ప్రాంతాల్లో కేసులు భారీగా రావడంతో ఆంక్షలు నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేస్తున్నారు.

ముఖ్యంగా గత వారం రోజులుగా గుంటూరు జిల్లాలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

 

జిల్లాలోని కొల్లిపర మండలంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు తాహసీల్దార్ నాంచారయ్య ఆదేశాలు జారీ చేశారు.

ఈనెల 16వరకు కొల్లిపర, తూములూరు, దావులూరు అడ్డరోడ్డు గ్రామాల్లో ఆంక్షలు అమలవుతాయని తెలిపారు,ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతి ఉంటుంది, టిబండ్లు టిఫిన్ బండ్లు హోటళ్లు అన్నీ కూడా మూసివేయాలి అని తెలిపారు