కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, ఇంకా లక్షలాది కేసులు నమోదు అవుతున్నాయి, భారత్ లో కాస్త కేసులు తగ్గుముఖం పడుతున్నా సెకండ్ వేవ్ టెన్షన్ కూడా ఉంది, అయితే కొత్తరకం కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఈ కొత్త రకం వైరస్ ని యూకేలో కనుగొన్నారు, ఇక్కడ నుంచి చాలా మంది ఇతర దేశాలకు వెళ్లారు ఈ సమయంలో వారిలో కొందరికి ఈ కొత్త వైరస్ లక్షణాలు కనిపించాయి.
దీంతో వారికి ఎక్కడికక్కడ టెస్ట్ లు చేస్తున్నారు.. మన భారత్ లో కూడా ఇలా యూకే నుంచి వచ్చిన వారికి టెస్టులు చేస్తున్నారు, కచ్చితంగా జగ్రత్తలు తీసుకోవాలి అని తెలియచేస్తున్నారు… కరోనా వైరస్ సోకిన వారికి దగ్గు జలుబు జ్వరం.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది అనేది తెలిసిందే.
కాని కొత్త వైరస్ కు సంబంధించి పలు లక్షణాలు కనిపిస్తున్నాయి స్ట్రెయిన్ వైరస్ లక్షణాలు పై ఆ దేశ నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఒక ప్రకటన చేసింది.. అలసట ఆకలి లేకపోవడం,విపరీతమైన తలనొప్పి విరేచనాలు, గందరగోళంగా అనిపించడం తీవ్రంగా కండరాల నొప్పులు ఇలాంటి కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి, ఇలాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి అని తెలియచేస్తున్నారు వైద్యులు.