కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది మంచి నిర్ణయం అంటున్నారు అందరూ, ఎందుకు అంటే ఇప్పటికే మనకు అన్నింటికి ఆధార్ కంపల్సరీ అయింది… ఈ సమయంలో ఓటర్ కార్డుకి కూడా ఆధార్ అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం.
ఆధార్ తో ఓటర్ ఐడీని అనుసంధానం చేస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించింది. కేంద్రమంత్రి ఓటర్ ఐడీకి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇక ఇలా అనుసంధానం చేయడం వల్ల ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది.. ఇప్పుడు ఎవరైనా రెండు ఓట్లు వచ్చిన వారు ఉంటున్నారు దీని వల్ల ఇక అలాంటి ఇబ్బందులు ఉండవు.
దీనివల్ల ఓటు హక్కు పరిరక్షణకు వీలవుతుంది…. అసలు ఎవరు ఓటు వేశారో, ఎవరు వేయలేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. అయితే ఇలాంటి డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది, తాజాగా కేంద్రం స్పష్టత ఇచ్చింది, దీని వల్ల ఒక వ్యక్తి పేరుమీద రెండు ఓట్లు అనేది ఎక్కడా ఉండదు, ఆధార్ నెంబర్ అనుసంధానం కాబట్టి ఒక్క ఓటు ఓ చోట మాత్రమే ఉంటుంది
దీనివల్ల నకిలీ ఓట్లను సులభంగా తొలగించవచ్చు.