బ్రేకింగ్ కోడెల ఆత్మహత్య కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయి

బ్రేకింగ్ కోడెల ఆత్మహత్య కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయి

0
106
Kodali Nani

టీడీపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిన్న ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. కోడెల ఆత్మహత్య కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏ1 ముద్దాయిగా చేర్చాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

తాజాగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… కోడెల ఆత్మకు శాంతికలగాలని కొరుకున్నారు.. కొద్దికాలంగా ఆయనకు ఇబ్బందులెదురైతున్నా కూడా చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు.. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్ డేటాను విచారించాలని ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రపై విచారించాలని అన్నారు…

కుటుంబంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకోకపోవడంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా చంద్రబాబుకు కోడెల సహకరించారని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.