బ్రేకింగ్ — ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవద్దు కేంద్రం హెచ్చరిక

బ్రేకింగ్ -- ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవద్దు కేంద్రం హెచ్చరిక

0
97

కేంద్రం ఎప్పటికప్పుడు యాప్స్ విషయంలో, పలు వెబ్ సైట్ల విషయంలో సెక్యూరిటీ అంశాలపై అలర్ట్ చేస్తుంది.. మరీ ముఖ్యంగా ప్రజలకు వీటిపై మోసాలు జరుగుతున్నాయి అనేది గుర్తించి అలర్ట్ చేస్తుంది…తాజాగా కేంద్ర ప్రభుత్వం తన సైబర్ అవేర్నెస్ ట్విట్టర్ హ్యాండిల్లో… ఓ హెచ్చరికను జారీ చేసింది.

స్మార్ట్ మొబైల్ వాడే ప్రజలు… తెలియని URLs నుంచి వచ్చే ఆక్సీమీటర్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవద్దని తెలిపింది..అయితే ఈ యాప్స్ లో మీ శరీరం ఎంత ఆక్సిజన్ శాతం ఉంది అని చెబుతున్నాయి.. అయితే ఇవి నమ్మశక్యం కాదు అని తెలుపుతున్నారు అధికారులు.

ఇలాంటివి డౌన్ లోడ్ చేసుకుంటే మీ డేటా అంతా దొంగిలిస్తున్నారు హ్యాకర్లు.. మీ ఫొటోలు, మీ వీడియోలు, మీ మొబైల్లో కాంటాక్ట్ నంబర్లు, పాస్వర్డ్లు దొంగిలిస్తాయిఈ యాప్స్… ఇవన్నీ హ్యాకర్లకు అందిస్తున్నారు…మీ బయోమెట్రిక్ వేలి ముద్రలు, స్కానింగ్ వంటి డేటాను కూడా దొంగిలిస్తున్నారు.. అందుకే ఇలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవద్దు అని కేంద్రం హెచ్చరికను జారీ చేసింది.. నకిలీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం అంతే సంగతులు.డిస్కౌంట్ కూపన్లు, క్యాష్ బ్యాక్లు, ఫెస్టివల్ కూపన్ల వంటివి సోషల్ మీడియా లింకుల ద్వారా కనిపిస్తే వాటిని నమ్మొద్దని కేంద్రం కోరింది.