కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు ఎక్కువగా కరోనా బారీన పడుతున్నారు…ఇప్పటికే చాలామంది ప్రజా ప్రతినిధులుకరోనా వైరస్ బారీన పడి కోలుకోగా మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు… ఇక మరికొందరు వైరస్ బారీన పడి మృతి చెందారు…
ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ దుర్గ ప్రసాద్ కరోనా బారీన పడి మృతి చెందారు… గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయన తిరుపతి ఎంపీగా పోటీ చేసి గెలిచారు… ఇటీవలే ఆయనకు కరోనా బారీనపడి మృతిచెందటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.. భారత రాజ్యాంగం ప్రకారం ఆయా సెగ్మెంట్ లలో ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసినా లేదా మరణించినా ఆరునెలలోగా ఎన్నికలు నిర్వహించారు…
అయితే సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబసభ్యులకే టికెట్ ఇస్తారు… ప్రతిపక్షాలు పోటీ చేయకుండా వదిలేస్తాయి.. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడు పుట్టిస్తుండటంతో ప్రతిపక్షాలుపోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గతంలో కూడా తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే ఆ ఎన్నికల్లోవైసీపీ పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే…