బ్రేకింగ్ – ఇక పై ఇలాంటి యాడ్స్ తీయకూడదు కీలక నిర్ణయం

బ్రేకింగ్ - ఇక పై ఇలాంటి యాడ్స్ తీయకూడదు కీలక నిర్ణయం

0
35

ఇప్పుడు వచ్చే చాలా రకాల యాడ్స్ విషయంలో కొన్ని అసలు ఎందుకు ఈ యాడ్ డిజైన్ చేశారు అనే విమర్శల పాలైన యాడ్స్ ఉన్నాయి, ఇక చిన్న పిల్లల విషయంలో కూడా అనేక రకాల యాడ్స్ వస్తున్నాయి, అయితే వారిపై ఇవి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ఈ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ప్రకటనలు ఇక తీయకూడదు, కొత్త రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని మోదీ సర్కార్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ను ఏర్పాటు చేసింది. ఇక వచ్చే యాడ్స్ కు కొన్ని నిబంధనలు ఇస్తుంది.

అమ్మకాల కోసం పిల్లలని టార్గెట్ చేసుకుని వారితో ప్రకటనలు చేయడం కుదరదు,ఇక ప్రమాదం రిస్క్ అనిపించే యాడ్స్ లో పిల్లల చేత నటించకూడదు, ఏ వస్తువు విషయంలో అయినా తప్పుదోవ పట్టించేలా యాడ్ ఉండకూడదు..పిల్లలు ఆల్కహల్, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో కనిపించకూడదు. ఇక ఏభాషలో అయితే యాడ్ వస్తుందో ఆ భాషలో కచ్చితంగా ఒక మనిషి ఎంత దూరం నుంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుందో.. అలా ప్రకటనలలో డిస్క్లైమర్ కూడా కనిపించాలి. ఇక చిన్న చిన్న అక్షరాలతో ఆ డిస్క్లైమర్ ఉంటే యాడ్ నిలిపివేస్తారు.