బ్రేకింగ్ జనసేన టీడీపీల మధ్య బిగ్ ఫైట్

బ్రేకింగ్ జనసేన టీడీపీల మధ్య బిగ్ ఫైట్

0
74

2014 ఎన్నికల్లో స్నేహంచేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలమధ్య తాజాగా మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది… ఈ ఘర్షణ అమరావతి ప్రాంతం అయిన విజయవాడలో చోటు చేసుకుంది.

జ్యోతిమహల్ కూడలి వద్ద అండర్ పాన్ నిర్మించాలని టీడీపీ నాయకులు సిద్దమయ్యారు. ఈ క్రమంలో జనసేననాయకులు ఈ నిర్మాణానికి అడ్డుతగిలారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది….

గతంలో అండర్ పాస్ నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు చెప్పారని ఇప్పుడు ఎలా పర్మీషన్ తెచ్చుకున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ కేసినేని నాని గద్దెరామ్మోహన్, అశోక్ బాబు చేరుకుని జనసేన నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.