బ్రేకింగ్ – ఖాళీగా ఉంటున్న ట్రైన్స్ – కీల‌క నిర్ణయం దిశ‌గా అధికారులు ?

బ్రేకింగ్ - ఖాళీగా ఉంటున్న ట్రైన్స్ - కీల‌క నిర్ణయం దిశ‌గా అధికారులు ?

0
41

ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా వ‌ర‌కూ రైలు ప్ర‌యాణాలు చేయాలి అని అనుకున్నా ఒక్క ట్రైన్ కూడా న‌డ‌వ‌లేదు, ఇక త‌ర్వాత కేంద్రం కొత్త‌గా 230 స‌ర్వీసులు న‌డుపుతోంది, అయితే ఈ రైలు స‌ర్వీసులు ప్రారంభించిన స‌మ‌యంలో గంట‌ల్లో టికెట్లు ఆన్ లైన్ లో బుక్ అయ్యాయి.

కాని ఇప్పుడు ప‌రిస్దితి మారింది …దూరం ముంబై ఢిల్లీ వంటి ప్రాంతాల‌కు వెళ్లేవారు త‌గ్గిపోయారు.. అటు నుంచి వ‌చ్చేవారు మాత్ర‌మే వ‌స్తున్నారు, దీంతో చాలా వ‌ర‌కూ స్టేష‌న్ల‌లో జ‌నం లేక ఖాళీగా ఉంటున్నాయి.
చాలా స్టేషన్లలో అసలు ప్రయాణికులు ఎక్కడం కానీ, దిగడం కానీ లేదు.

దీంతో ఇప్పుడు ఇలాంటి స్టేషన్లలో రైళ్లను నిలపకూడదని అధికారులు ఆలోచ‌న చేస్తున్నారు, ఇంకా వేగంగా రైలు చివ‌ర‌కు చేరుకునేలా స‌మ‌యం త‌గ్గుతుంది అని భావిస్తున్నారు, చాలా వ‌ర‌కూ దూర ప్రాంతం ట్రైన్స్ లో ఇదే కనిపిస్తోంది‌, వంద‌ల బెర్తులు ఖాళీ ఉంటున్నాయి.సికింద్రాబాద్-పాట్నా, పాట్నా-సికింద్రాబాద్ మధ్య రెండు రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు.