ఈ కరోనా మహమ్మారి చాలా మంది ప్రముఖులని మన నుంచి దూరం చేసింది, నేడు మరో విషాదం జరిగింది.టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి 69ఏళ్లు ఆయన కరోనాతో కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న సబ్బం హరి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మరణించారు… ఆయన మరణంతో ఆయన కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. సబ్బం హరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన రాజకీయంగా ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేశారు, గతంలో విశాఖ మేయర్ గానూ పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇక వైయస్ కుటుంబానికి విధేయుడిగా ఉండేవారు, వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో మిత్రుడిగా ఉండేవారు హరి… జగన్ కు కూడా వెన్నంటి ఉన్నారు, తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు..
కరోనా బారినపడిన ఆయన మొదట ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు… కానీ లక్షణాలు తీవ్రం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు.. కాని పరిస్దితి మరింత విషమించింది నేడు కన్నుమూశారు.