బ్రేకింగ్ న్యూస్ – మే 17వర‌కూ లాక్ డౌన్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

బ్రేకింగ్ న్యూస్ - మే 17వర‌కూ లాక్ డౌన్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

0
103

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తాజాగా లాక్ డౌన్ పొడిగించారు, కేంద్రం దీనిపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది,
లాక్ డౌన్ మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.అంద‌రూ రేపు లాక్ డౌన్ పై ప్ర‌క‌ట‌న వ‌స్తుంది అని ఇక లాక్ డౌన్ ఎత్తేస్తారు అని అంద‌రూ అనుకున్న స‌మ‌యంలో, ఒక్క‌సారిగా లాక్ డౌన్ మ‌రో 14 రోజులు పొడిగించారు.

ఇక రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు, ఇక గ్రీన్ జోన్లకు కొన్ని స‌డ‌లింపులు ఇచ్చారు, బ‌స్ లు కూడా గ్రీన్ జోన్ల‌లో న‌డుస్తాయి, కేవ‌లం అక్క‌డ లోకల్ గా మాత్ర‌మే తిప్పాలి, ఇక రైళ్లు విమానాలు బ‌స్సు ప్ర‌యాణాలు మే 17 వ‌ర‌కూ న‌డ‌వ‌వు అని తెలిపారు.

ఇక కేసులు కొన్ని చోట్ల పెరుగుతున్న కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకుంది కేంద్రం, ఇక రేపు గ్రీన్ జోన్ల‌కు సంబంధించి ఏమి స‌డ‌లింపులు ఇచ్చేది కూడా తెలియ‌చేయ‌నుంది, ఇక రెడ్ ఆరెంజ్ జోన్లు కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం క‌చ్చితంగా లాక్ డౌన్ కొన‌సాగుతుంది.