బ్రేకింగ్ న్యూస్ టీడీపీకి సాధినేని యామిని రాజీనామా

బ్రేకింగ్ న్యూస్ టీడీపీకి సాధినేని యామిని రాజీనామా

0
81

తెలుగుదేశం పార్టీలో మహిళానాయకురాల్లు చాలా మంది ఉంటారు. కాని అతి తక్కువ సమయంలో పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సాధినేని యామిని. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ పై ఎలాంటి విమర్శలు చేసినా ఆమె వెంటనే మీడియా ముఖంగా చీల్చి చెండాడేవారు, అప్పటి ప్రతిపక్ష వైసీపీని.

కాని ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆమె రాజకీయంగా కాస్త సైలెంట్ అయ్యారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇక బీజేపీ నేతలతో ఆమె ఎక్కువగా భేటీ అవడంతో ఆమె పార్టీకి దూరం అవుతారు అని వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

టీడీపీ మహిళా విభాగం నేత సాధినేని యామిని సైకిల్ పార్టీకి గుడ్బై చెప్పారు. టీడీపీ వాట్సప్ గ్రూప్లో తన రాజీనామా లేఖను ఆమె పోస్టు చేశారు. అయితే దీనికి కారణం కూడా చెప్పారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బలమైన కారణాల వల్లే టీడీపీకి రాజీనామా చేశానని యామిని ప్రకటించారు. ఇక ఆమె రాజీనామా లేఖని వైసీపీ గ్రూపుల్లో కూడా షేర్ చేసుకుంటున్నారు అభిమానులు