ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని లేదు అన్నీ వ్యాపారాలు చేస్తోంది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, అందుకే వరల్డ్ లో అమెజాన్ అంత పాపులర్ అయింది, తాజాగా అమెజాన్ షాపింగ్ లో అన్నీ వస్తువులు ఇంటికి వస్తున్నాయి, ఇక ఈ జాబితాలో అమెజాన్ మరో సరికొత్త సర్వీస్ స్టార్ట్ చేసింది.
ఔషధాలను కూడా ఆన్ లైన్ లో విక్రయించాలని భావిస్తోంది. అమెజాన్ ఫార్మసీ పేరిట అందించే ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇక డాక్టర్ ప్రిస్కిప్షన్ తో పాటు మీరు అడిగే అన్నీ మందులు కూడా ఇక ఆన్ లైన్ లో తీసుకురానుంది.
సంప్రదాయ భారత మూలికా ఔషధాలు కూడా అమెజాన్ ఫార్మసీలో లభించనున్నాయి. అలాగే వైద్య పరికరాలు వైద్యులకు కావలసిన మందులు ఎక్విప్ మెంట్స్ కూడా ఇందులో ఉంటాయి..అమెజాన్ ఫార్మసీ సేవలను తొలుత బెంగళూరులో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తనకు పోటీ ఇస్తున్న సంస్ధలకు ఇప్పుడు పోటీగా అమెజాన్ ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తోంది.