బ్రేకింగ్ – స్కూళ్ల రీ ఓపెన్ పై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

బ్రేకింగ్ - స్కూళ్ల రీ ఓపెన్ పై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

0
91

దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, ఏపీలో కూడా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది, అయితే దాదాపు మార్చి 20 నుంచి స్కూళ్లు కాలేజీలకు సెలవులు ఇచ్చారు, ఇక అప్పటి నుంచి సెలవులే, ఇక నేరుగా తర్వాత తరగతికి ప్రమోట్ చేశారు, ఈ సమయంలో విద్యా సంస్థలు తెరుచుకునే పరిస్థితి అయితే లేదు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పాఠశాల పునః ప్రారంభం పై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఆగస్టు 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పునః ప్రారంభించాలని నిర్ణయించింది జగన్ సర్కార్. కాని కేసులు ఇలా వేలల్లో వస్తూ ఉండటంతో మళ్లీ ఆలోచన చేస్తున్నారు, ఎందుకు అంటే ఇక రెండు వారాలు మాత్రమే సమయం ఉంది.

అయితే తాజాగా పాఠశాలలు రీ ఓపెనింగ్ పై పునర్ సమీక్షించిన జగన్ సర్కార్ పాఠశాలల ప్రారంభానికి మరో తేదీని ఖరారు చేసింది. సెప్టెంబర్ ఐదు నుంచి పాఠశాలలు తెరిచేందుకు కేంద్రానికి విన్నవించింది, సీఎం జగన్ కూడా ఈ తేదిపై ఆలోచన చేస్తున్నారు, కేంద్రం ఒకే చేస్తే సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయి అంటున్నారు అధికారులు.