బ్రేకింగ్ విద్యార్దుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో అవ‌కాశం

బ్రేకింగ్ విద్యార్దుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో అవ‌కాశం

0
88

ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన అన్నీ హ‌మీలు నెర‌వేరుస్తున్నారు, ఇచ్చిన మాట ప్ర‌కారం న‌వ‌ర‌త్నాల హామీలు ఏడాదిలోపు చాలా వ‌ర‌కూ చేసేశారు, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దేశంలో టాప్ లో ఉన్నారు.

కొత్త ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతూ అనేక సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా విద్యార్దుల‌కు అమ్మఒడి కూడా అందించారు, తాజాగా జగనన్న వసతి దీవెన- జగనన్న విద్యా దీవెన పథకాలకు అర్హులైనా లబ్ధి పొందలేని విద్యార్థులు ఎవ‌రైనా ఉంటే వారికి గుడ్ న్యూస్ చెప్పారు.

ఇలా అర్హత ఉండి ల‌బ్ది పొంద‌లేని విద్యార్దుల‌కి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లబ్ధిదారులు ఎవరికైనా డబ్బు అందకపోతే అలాంటి వారు వెంటనే గ్రామ- వార్డు వాలంటీర్ల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల‌ని తెలిపింది, మీరు మ‌ళ్లీ పూర్తి డీటెయిల్స్ వారికి ఇస్తే మీరు అర్హులు అయితే మీకు న‌గ‌దు బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తుంది..జగనన్న వసతి దీవెన కింద ప్రతి ఏటా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో రూ.20 వేలు జమ చేస్తోంది సీఎం జ‌గ‌న్ స‌ర్కార్.