బ్రేకింగ్ – తెలంగాణ‌లో క‌రోనాతో మాజీ ఎంపీ మృతి

బ్రేకింగ్ - తెలంగాణ‌లో క‌రోనాతో మాజీ ఎంపీ మృతి

0
102

క‌రోనా సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కూ అంద‌రికి సోకుతోంది, జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ప్ర‌మాదం అంటున్నారు నిపుణులు, ఈ మ‌ధ్య సినిమా న‌టులు రాజ‌కీయ నేత‌ల‌కు కూడా సోకుతోంది, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సీఎంల‌కు కూడా సోకుతోంది.

తాజాగా కొంద‌రు కోలుకుంటే మ‌రికొంద‌రు క‌న్నుమూస్తున్నారు, తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు..

ప‌ది రోజులుగా ఆయ‌న క‌రోనాకి చికిత్స తీసుకుంటున్నారు, నంది ఎల్లయ్య వయసు 78 సంవత్సరాలు
ఆయ‌న మ‌ర‌ణించారు అని తెలియ‌డంతో అంద‌రూ పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు సంతాపం ప్ర‌క‌టించారు.

ఆరు సార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఓటమి ఎరుగని నేతగా నంది ఎల్లయ్యకు గుర్తింపు ఉంది. సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో తెలంగాణ శాసనమండలికి ఎన్నికయ్యారు.