బ్రేకింగ్ – టీడీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటీవ్

బ్రేకింగ్ - టీడీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటీవ్

0
89

దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది, సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కూ అంద‌రికి సోకుతోంది, అయితే రాజ‌కీయ నాయ‌కుల‌కి కూడా వైర‌స్ ఇటీవ‌ల సోకుతున్న వార్త‌లు మ‌నం విన్నాం. పెద్ద ఎ‌త్తున నేత‌లు క‌రోనా బారిన ప‌డుతున్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ ముఖ్య‌మంత్రులు ముఖ్య మంత్రులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

అయితే ఏపీ తెలంగాణ‌లో ప‌లువురు ఎమ్మెల్యేల‌కు ఇప్ప‌టికే క‌రోనా సోకింది, ఇక తా‌జాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటీవ్ గా తేలింది.. తూర్పుగోదావరి జిల్లా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఆయన హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జోగేశ్వరరావు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్ప‌టికే చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ నేత‌ల‌కు కూడా వైర‌స్ సోకింది వారు చికిత్స పొంది క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.