తమిళనాడు రాజకీయాలు ఈసారి చాలా సరికొత్తగా సాగుతాయి అని చెప్పాలి … ఓ పక్క రాజకీయ పార్టీలతో పాటు ఇప్పుడు సినిమా స్టార్లు ఇద్దరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పోటికి సై అంటున్నారు.. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్ బీజేపీతో పాటు ఇక్కడ ఉన్న మిగిలిన చిన్న పార్టీలతో పాటు ఇప్పుడు కమల్ హాసన్ రజనీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు, సో ఈసారి ఎవరి వైపు ఓటరు ఉంటారు అనేది చెప్పలేని పరిస్దితి.
తాజాగా మరోకొత్త పార్టీ పుట్టనుందట తమిళనాట, అసెంబ్లీ ఎన్నికలలోగా కొత్త పార్టీని ప్రారంభిస్తానని దివంగత డీఎంకే మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే అళగరి ప్రకటించారు. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి .. అయితే ఆయన డీఎంకేలో చేరాలి అని చూసినా అక్కడ దారులు మూసే ఉన్నాయి.
ఇక పార్టీని మొత్తం స్టాలిన్ చూసుకుంటున్నారు, ఇక అళగిరి ఈ సారి బీజేపీలో చేరుతున్నారు అని వార్తలు వచ్చాయి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి కలవనున్నారు అని వార్తలు వినిపించాయి. కాని ఇది వాస్తవం కాదు అని తెలిపారు ఆయన… 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను క్రియాశీలక పాత్రను పోషించి తీరుతానని చెప్పారు. తన మద్దతు దారులతో భేటీ కానున్నారు ఆయన ఈ సమావేశంలో చర్చించి ప్రకటిస్తామన్నారు