నిన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధర నేడు కాస్త మళ్లీ తగ్గుముఖం పట్టింది… నేడు బంగారం ధర భారీగా తగ్గింది బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం, ముఖ్యంగా ఈ రోజుముంబై బులియన్ మార్కెట్లో కాస్త బంగారం అమ్మకాలు పెరిగాయి, వెండి ధర బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 తగ్గింది. దీంతో రేటు రూ.49,640కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.310 తగ్గింది. దీంతో ధర రూ.45,500కు చేరి ట్రేడ్ అవుతోంది.
ఇక బంగారం ధర తగ్గింది మరి వెండి ధర ఎలా ఉంది అనేది చూద్దాం. కేజీ వెండి ధర ఏకంగా రూ.79,200కు దూసుకెళ్లింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.