బ్రేకింగ్ – వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

బ్రేకింగ్ - వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

0
100

ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే . అయితే కొత్త ప్రైవసీ పాలసీ ఈ ఏడాది ప్రారంభంలో తీసుకువచ్చింది, చాలా మంది దీనిని వ్యతిరేకించారు, అయితే దానిని అంగీకరించిన వారికి మాత్రమే ఈ అకౌంట్స్ ఉంటాయి అని తెలిపింది కంపెనీ… కాని ప్రజలు యూజర్లు దీనిని పట్టించుకోలేదు వేరే యాప్స్ వాడేందుకు ఇంట్రస్ట్ చూపించారు.

మే 15 లోగా ప్రైవసీ పాలసీని అంగీకరించాలంటూ యూజర్లకు డెడ్ లైన్ విధించింది. అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండడంతో వాట్సాప్ వెనుకంజ వేసింది. ఇక మే 15 రావడానికి ఇక వారం రోజులు ఉండగా కీలక నిర్ణయం తీసుకుంది కంపెనీ.

ఇక ప్రైవసీ పాలసీ అంగీకరించాలంటూ ఒత్తిడి చేయబోమని, ఖాతాలు నిలిపివేయబోమని వాట్సాప్ వెల్లడించింది. మే 15 తర్వాత కూడా ఖాతాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక ఈ డెడ్ లైన్ తొలగించాము అని తెలిపింది.