బ్రేకింగ్ – ఇక లిక్క‌‌ర్ హోం డెలివ‌రీ షాపులు తీయ‌రు

బ్రేకింగ్ - ఇక లిక్క‌‌ర్ హోం డెలివ‌రీ షాపులు తీయ‌రు

0
84

దేశ వ్యాప్తంగా 50 రోజులుగా లాక్ డౌన్ అమ‌లులో ఉంది, ఈ స‌మ‌యంలో చాలా వ‌ర‌కూ దుకాణాలు తీయ‌డం లేదు, అయితే కేంద్రం తాజాగా మ‌ద్యం దుకాణాల‌కు స‌డ‌లింపులు ఇచ్చింది, గ్రీన్ ఆరెంజ్ జోన్ల‌లో మాత్రం మ‌ద్యం దుకాణాలు తెర‌చుకున్నాయి, అయితే ఇక్క‌డ భౌతిక దూరం మాత్రం పాటించ‌డం లేదు దీంతో కొన్ని చోట్ల మద్యం అమ్మ‌కాలు నిలిపేశారు.

ఇక కొంద‌రు అయితే హోమ్ డెలివ‌రీ చేయాలి అని భావిస్తున్నారు, కేవ‌లం లైసెన్స్ ఉన్న వారు మాత్ర‌మే ఇలా చేయాలి అయితే తాజాగా చాలాస్టేట్స్ మ‌ద్యం హొమ్ డెలివ‌రీకి సిద్దం అవుతున్నాయి,
ఇప్పటికే పశ్చిమ బెంగాల్, పంజాబ్‌‌ రాష్ట్రాల్లో మద్యాన్ని హోమ్‌ డెలివరీ ద్వారా వినియోగదారులకు అందజేస్తున్నారు.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యాన్ని ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించింది.ఇక మ‌ద్యం ఇంటికి నేరుగా తీసుకువ‌స్తారు, కేవ‌లం లైసెన్స్ ఉన్న వారు మాత్ర‌మే మ‌ద్యం ఇలా ఇవ్వాలి, ఇక ఉద‌యం ఆర్డ‌ర్ తీసుకోవ‌డం సాయంత్రం డెలివ‌రీ చేస్తారు అని తెలుస్తోంది, ఇక మ‌ద్యం డెలివ‌రీ చేసేవారు క‌చ్చితంగా మాస్క్ ధ‌రించాలి. శానిటైజ‌ర్ వాడాలి.