కొత్త ఏడాది విషాద వార్త వినాల్సి వచ్చింది… వైసీపీ నేతలను విషాదంలో ముంచెత్తింది…కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు. ఈకరోనా చాలా మందిని పొట్టనపెట్టుకుంది…తాజాగా ఆయన మరణించారు అని తెలిసి పార్టీ నేతలు ఆయన అభిమానులు షాక్ లో ఉన్నారు.
కరోనా సోకిన వెంటనే గత నెల 13న హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు ఆయన. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు, ఈ ఉదయం ఆయన మరణించారు, ఆయక కర్నూలు జిల్లాకు చెందిన నేత, ఆయన సొంత ఊరు అవుకు మండలంలోని ఉప్పలపాడు.
ఆయన పొలిటికల్ లైఫ్ చూస్తే
1983లో పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు
తర్వాత . 1989లో డోన్ నుంచి నిలబడ్డారు ఓటమిపాలయ్యారు
1991లో నంద్యాల పార్లమెంటు స్థానం లో పోటీ చేశారు ఓటమిపాలయ్యారు
1994లో కోవెలకుంట్ల నుంచి పోటీ చేశారు ఓటమిపాలయ్యారు
1999, 2004లలో మాత్రం భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.
తర్వాత ఆయన తెలుగుదేం పార్టీలో చేరారు
ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాబు హయాంలో పని చేశారు
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు.
ఆయన మరణంతో పార్టీ నేతలు అభిమానులు సంతాపం తెలిపారు.