బ్రేకింగ్ ఇద్దరు వైసీపీ మంత్రులు రాజీనామా…

బ్రేకింగ్ ఇద్దరు వైసీపీ మంత్రులు రాజీనామా...

0
90

ఈరోజు ఏపీలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి… మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి… ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు… సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది…

ఇదే రోజు ఇద్దరు మంత్రులకు చివరి రోజు… రాజ్యసభకు ఎన్నిక అయిన తర్వాత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ తమ పదవులుకు రాజీనామా చేయనున్నారు… 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి వీరిద్దరు ఓటమి చెందారు…

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వారిని ఎమ్మెల్సీలను చేసి తన కెబినెట్ లోకి తీసుకున్నారు… కాగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు… అందుకే వారికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిని చేశారు…