తెలంగాణలో వైయస్ షర్మిల కొత్త పార్టీతో ప్రజల్లోకి వస్తున్నారు, మేధావులు యువత విద్యార్దులు ఇలా అందరితో ఆమె మాట్లాడుతున్నారు, ముఖ్యంగా తెలంగాణలో పలు జిల్లాల నుంచి నేతలు ఆమెని వచ్చి కలుస్తున్నారు, అక్కడ సమస్యల గురించి తెలియచేస్తున్నారు… నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు.
ఈ సమయంలో ఆమె ఎంపీ ధర్మపురి అరవింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపర్ ఇచ్చారట, వారు రైతులని దగా చేశారు అని పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్ పై ….
మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా అని ప్రశ్నించారు, అంతేకాదు రైతులు ఎన్నో బాధలు పడుతున్నారు,
ఎక్స్ టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా అని ప్రశ్నించారు ఆమె..
మొత్తానికి ఆమె కామెంట్లు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి.. మరి టీఆర్ఎస్ కు గట్టి పోటీ అని బీజేపీ కాంగ్రెస్ చెబుతుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి టీఆర్ ఎస్ కు షర్మిల పార్టీ గట్టి పోటీ ఇస్తుంది అంటున్నారు, తెలంగాణలో వైయస్సార్ అభిమానులు షర్మిల అభిమానులు.
|
|
బ్రేకింగ్ — ఎంపీ అరవింద్ పై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
-