బడ్జెట్ 2020 హైలెట్స్ రైతులకి వరాలు సంతోషంలో దేశీయ రైతులు

బడ్జెట్ 2020 హైలెట్స్ రైతులకి వరాలు సంతోషంలో దేశీయ రైతులు

0
90

నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడుతోంది, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్, బడ్జెట్ ప్రవేశ పెట్టారు మరి బడ్జెట్ లో ని ముఖ్యమైన అంశాలు చూద్దాం.

బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
దివంగత నేత అరుణ్ జైట్లీని గుర్తుచేసిన నిర్మల
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్-నిర్మల
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
కేంద్రం చేపట్టిన సంస్కరణల్లో జీఎస్టీ చరిత్రాత్మకమైనది
జీఎస్టీతో సామాన్యులకు నెలకు 4 శాతం వరకూ ఆదా -నిర్మల

ద్రవ్యోల్బణం అదుపులో ఉంది-నిర్మల
40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి
జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్ లక్ష్యం
రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు

26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు
పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం -నిర్మల
ఇన్కం టాక్స్ రిటర్న్ల ఫైలింగ్ మరింత సులభతరం చేస్తాం
ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
మా తొలి ప్రాధాన్యం – వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
ద్వితీయ ప్రాధాన్యాంశం -ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
మూడో ప్రాధాన్యాంశం- విద్య, చిన్నారుల సంక్షేమం
రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్తో కూడిన కిసాన్ రైలు ఏర్పాటు