బస్సుల వ్యాపారం మూసేస్తున్నా జేసీ సంచలన నిర్ణయం

బస్సుల వ్యాపారం మూసేస్తున్నా జేసీ సంచలన నిర్ణయం

0
104

తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు పార్టీ మారే సమయంలో విమర్శలు చేయడం షరామాములే అని అన్నారు మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి.. వారికి ఏదీ దొరక్క అలాంటి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు జేసి.. పంతం పగ ప్రతీకార చర్యలకు సీఎం జగన్ దిగుతున్నారు అని హెచ్చరించారు.. అయితే తనపై కూడా అనేక ఒత్తిడులు వస్తున్నాయి అని అన్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు తన బస్సుల వ్యాపారాన్ని అడుగు అడుగునా అడ్డుకుంటున్నారని, అధికారులు కూడా ఈ ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదు అని గుర్తు ఉంచుకోవాలి అని చెబుతున్నారు.

అందుకే తాను బస్సులు వ్యాపారం వల్ల వివాదాలు సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొద్దిరోజులు బస్సుల వ్యాపారం మానెయ్యాలని భావిస్తున్నట్లు తెలియచేశారు.. మొత్తానికి తెలుగుదేశం నేతలు ఆ పార్టీ అధికారంలో ఉన్నంత సేపు అడ్డు అదుపు లేకుండా తమ వ్యాపారాలు చేసుకున్నారని ఇక వైసీపీ వచ్చే సమయానికి ఇలాంటి వ్యవహారాలు నడవక అధికారులపై విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు పార్టీ నేతలు.. అయితే జేసి మాత్రం పార్టీ మారను అని చెబుతున్నారు.. కావాలంటే నాలుగు రోజులు జైలుకి వెళతా, అంతే కాని వైసీపీలో చేరే అవకాశం లేదు అని చెప్పారు దివాకర్ రెడ్డి.