ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని ప్రజల రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు పార్టీ నాయకులు…ముఖ్యంగా సర్వేలు అన్నీ పెయిడ్ సర్వేల అని జగన్ కు నిజంగా వస్తున్న జనం కాదు అని విమర్శిస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఇక ఆంద్రావాళ్లని కుక్కలు అన్న కేసీఆర్ తో జగన్ ఒప్నందాలు చేసుకుని ఏపీలో గెలిచేందుకు ప్రణాళికలు చేసుకున్నాడు అందుకే ప్రజలకు ఇక్కడ వాస్తవాలు తెలిశాయి అంటున్నారు టీడీపీనేతలు.ఆంధ్రులు కుక్కలన్న కేసీఆర్తో జగన్ జతకట్టడం సిగ్గుచేటన్నారు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి. బీజేపీలో వైసీపీ భాగమేనని.. వైసీపీకి డైరెక్టర్, నిర్మాత మోదీనే అన్నారు. ఏపీ ప్రజలు జగన్ ని నమ్మే స్దితిలోలేరు అని ఆయన విమర్శించారు.. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ తరపున ప్రచారం చేసిన బైరెడ్డి.. జగన్పై మండిపడ్డారు. తెలుగుదేశం మైనార్టీలకు ఎంతో చేసింది అని అసలు జగన్ వల్ల డవలప్ మెంట్ జరుగదు అని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో జగన్ జోరు తగ్గి సైకిల్ స్పీడ్ పెరిగిందన్నారు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. 120 సీట్లు రావడం ఖాయమని బైరెడ్డి రాజశేఖర్రెడ్డి జోస్యం చెప్పారు. ఎస్వీ మోహన్ రెడ్డి షేర్ మార్కెట్ లా పార్టీలు మారుతూ ఉంటాడు అని పార్టీ తరపున ప్రచారంలో ఆయన అన్నారు వైసీపీకి 30 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని ఆయన విమర్శించారు. జగన్ ఓట్లు అడగడం రాదు అలాగే పోల్ మేనేజ్ మెంట్ కూడా తెలియదు అని అన్నారు ఆయన.