నా వెంట్రుక కూడా పీకలేరు – సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం వైఎస్ జగన్

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జరిగిన వసతి దీవెన కార్యక్రమంలో చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అనుకూల మీడియా తాము చేసే మంచి పని గురించి రాయరన్నారు.

మన ప్రభుత్వం చేస్తున్న మంచి, పచ్చపార్టీకి, చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, పచ్చమీడియాకు కనిపించవని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సరిపోలేదని, మన పరువును పార్లమెంట్ లో కూడా తీసేందుకు పచ్చపార్టీ ప్రయత్నిస్తుంది. మన రాష్ట్రంలో దౌర్భాగ్యపు ప్రతిపక్షం ఉందని జగన్ అన్నారు. డిల్లీ లెవల్లో మన రాష్ట్ర పరువును తాకట్టు పెడుతుంది. దేవుని దయ, ప్రజల దీవెనలు ఉన్నంత వరకు వీరంతా నా వెంట్రుక కూడా పీకలేరు అని నంద్యాలలో జరిగిన కారక్రమంలో  సంచలన వ్యాఖ్యలు చేసారు.