కారు బైక్ కొనాలనుకుంటున్నారా మీకు మోదీ సర్కార్ శుభవార్త

కారు బైక్ కొనాలనుకుంటున్నారా మీకు మోదీ సర్కార్ శుభవార్త

0
104

ఈ కరోనా సమయంలో చాలా మంది ఆరు నెలల కాలంలో కారు బైక్ లు కొనాలి అని భావించారు… కరోనా ఫీవర్ తో వారు ఎవరూ కొనుగోలు చేయలేదు.. దీంతో పూర్తిగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంతో దెబ్బ తింది ..అయితే తాజాగా కాస్త మార్కెట్ మాత్రం మళ్లీ పెరుగుతోంది.

ఇది కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.. లగ్జరీ కార్లు కాకపోయినా మిడ్ రేంజ్ కార్లు బైక్ ల అమ్మకాలు మళ్లీ ఆగస్ట్ నుంచి కాస్త ఊపు అందుకున్నాయి, అయితే తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కారు కొనుగోలుదారులకు ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకోబోతోంది.. వాహనాలపై జీఎస్టీని తగ్గించే యోచనలో మోదీ సర్కార్ ఉంది. అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంతో లాస్ లో ఉంది, అమ్మకాలు లేవు ఈ సమయంలో కాస్త పన్నుపోటు తగ్గితే కొనుగోళ్లు ఉంటాయి అని భావిస్తున్నారు, అయితే బైక్స్ పై కూడా జీఎస్టీ తగ్గించే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. టూవీలర్లు, త్రివీలర్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్లపై జీఎస్టీ తగ్గే అవకాశముందని అంటున్నారు.. టూవీలర్లపై కూడా 28 శాతం జీఎస్టీ ఉంది. బహుశా 18 లేదా 20 శాతం మాత్రమే జీఎస్టీ ఉండేలా నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.