ఏపీ ప్రధాన ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై ఇటీవలే కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే… దీంతో ఆయన్న అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ వెళ్లడించారు. దీంతో ఆయన ప్రస్తుతం పరారిలో ఉన్నారు…
ఇటీవలే రాజమండ్రి కోర్టు స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా అక్కడికి హర్షకుమార్ చేరుకుని జిల్లా న్యాయమూర్తిని పరుష పదజాలంతో దూషించారని అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెధిరించారని చెప్పారు. దీనిపై జిల్లా కోర్టు పరిపాలనాధికారి పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకే ఆయనపై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు…
కాగా ఇప్పటికే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసులు నమోదు చేసి ఆయన్ను రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే ఇదే క్రమంలో హర్షకుమార్ పై కేసు నమోదు కావడం టీడీపీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి