టాలీవుడ్ నుంచి జగన్ వద్దకు మరో ఇద్దరు

టాలీవుడ్ నుంచి జగన్ వద్దకు మరో ఇద్దరు

0
81

ఏపీలో ఈసారి ఎన్నికలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి..ఎన్నికల్లో గెలుపుకోసం అన్ని వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి పార్టీలు… ముఖ్యంగా జగన్ వెంట ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా నడుస్తుంది అని చెప్పాలి… బాబు దగ్గర 1970 బ్యాచ్ అందరూ ఉన్నారు అని అంటున్నారు కొందరు… అయితే ఆనాటి నుంచి బాబుకి సపోర్ట్ చేసిన వారే కాని ఇప్పుడు కొత్తగా సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరు అని నేరుగానే కొందరు విమర్శలు చేస్తున్నారు… ఇటీవల పలువురు టాలీవుడ్ ప్రముఖులు వైసీపీలో చేరడం, జగన్ కు పాజిటీవ్ గా మాట్లాడటం అలాగే ఏకంగా ప్రచారాల్లో కూడా వారు బిజీగా మారడంతో పెద్ద ఎత్తున జనం కూడా ఫోకస్ చేస్తున్నారు.

నటులు మోహన్ బాబు, పృథ్వి, పోసాని, శివాజీ రాజ్, రచయితలు చిన్ని కృష్ణ, కోన వెంకట్ లాంటి వారంతా వైఎస్ జగన్కు మద్దతు తెలుపుతూ ఆయన పార్టీలో చేరిపోయారు. ఇక జనసేన తెలుగుదేశం ఈ విషయంలో బ్యాక్ లోనే ఉన్నాయి.. ముఖ్యంగా పవన్ వెంట జబర్దస్త్ టీం గబ్బర్ సింగ్ టీం మినహా ఎవరూ లేరు అనేది ట్రెండ్ కామెంట్.. స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కూడా వైసీపీకి మద్దతు ఇచ్చారు ..అలాగే నిర్మాత అచ్చిరెడ్డి
కూడా మద్దతు ఇచ్చారు….వీరు ఇప్పుడు ప్రచారానికి కూడా సిద్దం అవుతున్నారు అని టాక్ అయితే వినిపిస్తోంది, ఓ పక్క అలీ కూడా స్టార్ క్యాంపెయినర్ గా తిరుగుతూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.