ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..రూ.351 కోట్ల సాయం

0
103

ఏపీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత మూడు నెలల క్రితం ఏపీని  వరదలు ముంచెత్తాయి. దీంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అయితే ఈ వరద ప్రభావానికి అతలాకుతలమైన ఏపీకి కేంద్ర ప్రభుత్వం దానికి ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.351 కోట్లు విడుదల చేసింది. అటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 112 కోట్లు, కర్ణాటక రాష్ట్రానికి 429 కోట్లు, మహారాష్ట్రకు 355 కోట్లు, పుదుచ్చేరికి 17 కోట్లు.. మొత్తం పదహారు వందల ఎనభై రెండు కోట్ల సహాయాన్ని రాష్ట్రాలకు అందించనున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది అనూహ్యంగా వచ్చిన భారీ వరదలకు రాయలసీమ ప్రాంతంలో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ముఖ్యంగా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి.. ప్రాజెక్ట్ కింద ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అదేవిధంగా తిరుపతి నగరాన్ని కూడా వర్షాలు ముంచెత్తడంతో.. తిరుమల కొండపై టీటీడీ ఆస్తులు ధ్వంసమయ్యాయి.